వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లపై అసెంబ్లీలో చర్చ.. సీఎం కేసీఆర్‌ ఏమన్నారంటే?

CM KCR Speech on Veg and Non Veg markets construction. తెలంగాణ బడ్జెట్‌ - 2023 సమావేశాలు కొనసాగుతున్ఆనయి. అసెంబ్లీ సమావేశాల్లో

By అంజి  Published on  12 Feb 2023 7:58 AM GMT
వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లపై అసెంబ్లీలో చర్చ.. సీఎం కేసీఆర్‌ ఏమన్నారంటే?

తెలంగాణ బడ్జెట్‌ - 2023 సమావేశాలు కొనసాగుతున్ఆనయి. అసెంబ్లీ సమావేశాల్లో నేడు ప్రశ్నోత్తరాల చర్చ మొదలైంది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు.. సమీకృత వ్యవసాయ మార్కెట్లు, కల్తీ విత్తనాల గురించి ప్రశ్నలు అడిగారు. వీరి ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పారు. శాస్త్రీయ దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు నిర్మిస్తున్నారని కేసీఆర్‌ శాసనసభలో చెప్పారు. భూమిపై కూరగాయలు పెట్టి విక్రయిస్తే బ్యాక్టీరియా ముప్పు ఉంటుందని, అందుకే మోండా మార్కెట్‌ మాదిరిగా.. రాష్ట్రంలో మార్కెట్లు నిర్మించాలని కలెక్టర్‌ సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అత్యాధునిక మార్కెట్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం తెలిపారు.

హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవన్న కేసీఆర్‌.. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవన్నారు. గతంలో శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు ఏర్పడ్డాయని, నిజాం కాలం నాటి మోండా మార్కెట్‌ శాస్త్రీయతతో ఏర్పాటైందని చెప్పారు. 100 లక్షలకుపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌ మహా నగరంలో సరిపడా మార్కెట్లు లేవన్నారు. హైదరాబాద్‌లో మార్కెట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించామని, సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లకు శ్రీకారం చుట్టామని కేసీఆర్‌ తెలిపారు.

అధునాతన మార్కెట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం కేసీఆర్ శాసనసభలో తెలిపారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేసేలా ఉద్దేశ్యం తీసుకున్నామన్నారు. నియోజకవర్గాల్లో మార్కెట్ల నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతున్నాయని వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల అధికారులు చూసి మన అభివృద్ధి పనులను చూసి స్ఫూర్తి పొందుతున్నారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తున్నామని, అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు.

Next Story