రాంచీ చేరుకున్న సీఎం కేసీఆర్‌.. ఘ‌న స్వాగ‌తం

CM KCR reach Ranchi.తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నాం ఢిల్లీ నుంచి నేరుగా జార్ఖండ్ రాజ‌ధాని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2022 8:16 AM GMT
రాంచీ చేరుకున్న సీఎం కేసీఆర్‌.. ఘ‌న స్వాగ‌తం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నాం ఢిల్లీ నుంచి నేరుగా జార్ఖండ్ రాజ‌ధాని రాంచీకి చేరుకున్నారు. రాంచీ ఎయిర్‌పోర్టులో సీఎంకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అక్క‌డి నుంచి బిర్సా ముండా చౌక్‌కు చేరుకున్న కేసీఆర్.. అక్క‌డ స్వాతంత్రోద్యమ నాయకుడు, గిరిజన ఉద్యమ నేత, ఝార్ఖండ్ ప్రజల ఆరాధ్య నాయకుడు, భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అక్క‌డి నుంచి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ నివాసానికి బ‌య‌లుదేరారు.

ఇక సీఎం కేసీఆర్ జార్ఖండ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లుకుతూ ఆ రాష్ట్ర‌నాయ‌కులు, ప్ర‌జ‌లు ఫెక్సీల‌ను ఏర్పాటు చేశారు. జార్ఖండ్ వ‌స్తున్న తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బంగారి తెలంగాణ నిర్మాత, జాతీయ ఫెడరల్ నేత సీఎం కేసిఆర్ కు ఘ‌న స్వాగ‌తం అంటూ రాసిన ఫ్లెక్సీల‌ను కేసీఆర్ ప్ర‌యాణించే మార్గాల్లో ఉంచారు.


చైనా సరిహద్దులోని గాల్వాన్‌ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది సైనికులు వీర మరణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఇందులో తెలంగాణకు చెందిన సంతోష్‌ బాబు ఒకరు. ఆ సమయంలో సీఎం కేసీఆర్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి రూ. 5 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించారు. మిగతా 19 మంది సైనికులకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో జార్ఖండ్ కు వెళ్లిన కేసీఆర్ ఇద్ద‌రు అమ‌ర జ‌వాన్ల కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించ‌నున్నారు. రాంచీలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తోపాటు జార్ఖండ్ సీఎం హేమంత్‌ సొరెన్‌ కూడా పాల్గొన‌నున్నారు.

Next Story