మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం

CM KCR Meet With MLAs. మరి కాసేపట్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌లో

By Medi Samrat  Published on  22 Feb 2021 10:22 AM IST
CM KCR Meet With MLAs
మరి కాసేపట్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. తాజా రాజకీయ పరిణామాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పలు అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు కేసీఆర్‌. రాజకీయ వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్‌ పిలుపుతో ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.


ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణీదేవిని ఎంపిక చేసింది టీఆర్‌ఎస్‌. వాణీదేవి.. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు కుమార్తె. ఆమె ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటించి.. ప్రచారాన్ని ప్రారంభించగా... ఒక్క స్థానానికి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ప్రకటన ఆలస్యమైంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. అటు బీజేపీ.. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావునే మళ్లీ బరిలోకి దింపింది.


Next Story