మార్కెట్ యార్డ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
CM KCR inaugurates market yard in Chityala Village.ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా
By తోట వంశీ కుమార్ Published on
8 March 2022 8:17 AM GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చిట్యాలలో వ్యవసాయ మార్కెట్ యార్డును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
వనపర్తి చేరుకున్న సీఎంకు మంత్రులు, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన ఊరు – మన బడి' కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ లో మరికాసేపట్లో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత ప్రభుత్వ వైద్యకళాశాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల మైదానం వద్ద నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది.
Next Story