7న కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం
CM KCR high level meeting on 7th I 7న కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం
By సుభాష్ Published on
5 Dec 2020 10:24 AM GMT

ఈనెల 7వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ ఏడాది రెండో విడత రైతు బంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై కేసీఆర్ ఈ సమావేశంలో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొననున్నారు.
Next Story