రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులకు తీపి కబురు : సీఎం కేసీఆర్
CM KCR good news to unemployees in Wanaparthy meeting.వనపర్తి వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు
By తోట వంశీ కుమార్ Published on 8 March 2022 2:48 PM GMTవనపర్తి వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో రేపు (మార్చి 9) నిరుద్యోగుల కోసం కీలక ప్రకటన చేయబోతున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగులందరూ టీవీ చూడాలని పిలుపునిచ్చారు. వనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.
అంతర్జాతీయ మహిళా దినోవత్సం సందర్భంగా మహిళలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారన్నారు. వనపర్తి జిల్లా అవుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఒకప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడ చూసినా కరువు, బీడు భూములు కనిపించేవని.. ఉద్యమ సమయంలో జిల్లాను చూస్తే కళ్లల్లో నీరు తిరిగేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయితే మహబూబ్‌నగర్ జిల్లా వజ్రపు తునకగా మారుతుందని తెలిపారు.
ధాన్యపు రాశులతో ఇప్పటికే పాలమూరు జిల్లా పాలు కారుతోందని, హైదరాబాద్ నుంచి గద్వాల వరకు పచ్చదనం కనిపిస్తోందన్నారు. గతంలో పాలమూరు జిల్లా నుంచి లక్షల మంది వలస పోయేవారని.. ఇప్పుడు కర్నూలు, కర్ణాటక వాసులు మహబూబ్‌నగర్ జిల్లాకు వలస వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం వనపర్తిలో ఎకరం రూ.3కోట్ల ధర పలుకుతోందన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ లేదు. నేడు ఐదు మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు, ఆకలి చావులు లేవన్నారు. విద్యుత్ కోతలు లేవని, వలసలు లేవన్నారు. సొంత రాష్ట్రం వస్తే ఇలా బతుకుదాం అని చెప్పాం.. చేసి చూపించామని తెలిపారు. తెలంగాణ వలే దేశం పరిస్థితి కూడా మారాలన్నారు. దేశం కోసం పోరాటానికి మేం సిద్దంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం కోసం ఎలా కొట్టాడామో.. ఈ దేశంలో శాంతి, సామరస్యాన్ని, మంచిని కాపాడేందుకు అవసరమైతే నా ప్రాణా కూడా ధారపోసేందుకు సిద్దంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.