Telangana: మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ వీ భూపాల్‌రెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నియమించారు.
By అంజి Published on 6 July 2023 9:31 PM ISTTelangana: మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కార్పొరేషన్ల పదవుల భర్తీపై దృష్టిపెట్టింది. ఆయా సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగా కార్పొరేషన్ల పదవులకు నియామకం చేపట్టింది. తాజాగా రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లకు సీఎం కేసీఆర్ ఛైర్మన్లను నియమించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ వీ భూపాల్‌రెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నియమించారు. దీనికి డైరెక్టర్లుగా గోసుల శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్), మహ్మద్ సలీం (నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేనెవట్ల గ్రామం) నియమితులయ్యారు.
అలాగే తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మర్వెల్లి గ్రామానికి చెందిన మటం బిక్షపతి నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మహ్మద్ తన్వీర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్ పదవులకు ఎంపికైన వీరు.. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మార్వెల్లికి చెందిన శ్రీ మాటం బిక్షపతిని తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు… pic.twitter.com/V234nGfSU1
— Telangana CMO (@TelanganaCMO) July 6, 2023
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ శ్రీ వి. భూపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు నియమించారు. డైరెక్టర్లుగా హైదరాబాద్ కు చెందిన శ్రీ గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణ పేట జిల్లా, మద్దూర్ మండలం, రెనెవట్లకు చెందిన మొహమ్మద్ సలీంలను నియమించారు.… pic.twitter.com/AWBTZYipzg
— Telangana CMO (@TelanganaCMO) July 6, 2023