ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులను ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్‌..

CM KCR Announced MLA Quota MLC Candidates. తెలంగాణ‌ రాష్ట్ర శాసన మండలి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు

By Medi Samrat
Published on : 7 March 2023 5:16 PM IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులను ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్‌..

CM KCR Announced MLA Quota MLC Candidates


తెలంగాణ‌ రాష్ట్ర శాసన మండలి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి లను ఫైన‌ల్ చేశారు. వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.

ఇదిలావుంటే.. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కూర్మయ్యగారి నవీన్ కుమార్ కు కేసీఆర్ మరో చాన్స్ ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా కేసీఆర్ వెంటే ఉన్న ఆయన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దేశపతి శ్రీనివాస్.. తెలంగాణ ఉద్యమకారుడిగా పేరుంది. మంచి వక్త‌. పాటలు పాడతారు. సీఎంవోలో ఓఎస్డీగా ప‌నిచేశారు. ఆయ‌న‌కు కేసీఆర్ అవ‌కాశ‌మిచ్చారు. చల్లా వెంకట్రామిరెడ్డి.. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కుమార్తె కుమారుడు. అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే. జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయంగా పట్టు, మంచి పేరు ఉన్న రాజకీయ కుటుంబం. ఇటీవలే బీఆర్ఎస్‌లో చేరగా.. పార్టీలో తగు స్థానం కల్పిస్తామ‌ని కేసీఆర్ అన్నారు. అన్న మాట ప్రకారం ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చారు.


Next Story