ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టాలని ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు

CM KCR accords top priority to welfare of people. రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నార‌ని

By Medi Samrat  Published on  26 March 2022 8:23 AM GMT
ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టాలని ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు

రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నార‌ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్ర‌జ‌ల‌ ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో దళిత బంధు పథకం లబ్ధిదారులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం విజయవంతం కావడంతో.. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తమ కోసం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టాలని తమ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తారని అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేయడంతో.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 1500 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో వ్యవసాయం, తాగునీరు అవసరాలకు సరిపడా నీళ్లు లేవు. ప్రజలు కూడా విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగంపై ఎక్కువ దృష్టి పెట్టి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇతర ప్రాజెక్టులను నిర్మించిందని.. ఇది తాగునీరు, నీటిపారుదల రంగ అవసరాలను తీర్చడంలో సహాయపడిందని.. మిషన్ కాకతీయ కార్యక్రమంతో భూగర్భ జలాలు కూడా గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉచితంగా 2 బిహెచ్‌కె ఇళ్లను మంజూరు చేస్తోందని అన్నారు. ఆడపిల్లల పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ.1,00,116 ఇస్తోందని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనులు ఈ ఏడాది పూర్తిచేస్తామన్నారు.










Next Story