Medak: గోవుల రవాణా నేపథ్యంలో ఘర్షణ.. పట్టణంలో 144 సెక్షన్‌

అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో, మెదక్ జిల్లా రాందాస్ చౌరస్తా సమీపంలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on  16 Jun 2024 4:39 AM GMT
Clash, Medak, cow transportation, Section 144

Medak: గోవుల రవాణా నేపథ్యంలో ఘర్షణ.. పట్టణంలో 144 సెక్షన్‌

మెదక్: గోవధ చేసేందుకు ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై శనివారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో, తెలంగాణలోని మెదక్ జిల్లా రాందాస్ చౌరస్తా సమీపంలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లోని సెక్షన్ 144, ఒక ప్రాంతంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధిస్తుంది. సాధారణంగా హింస, అల్లర్లకు దారితీసే ఎలాంటి నిరసనలను నివారించడానికి అమలు చేయబడుతుంది. పోలీసులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మెదక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ బి బాల స్వామి తెలిపారు.

ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని, ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినందున దర్యాప్తు కొనసాగుతోందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆవుల రవాణాను భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగిందని, ఫిర్యాదు చేయకుండా నిరసనకు దిగారని ఆయన తెలిపారు. “కొట్లాటలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అనంతరం ఇరువర్గాలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిపై కూడా దాడి జరిగింది' అని స్వామి తెలిపారు.

పట్టణంలో శనివారం రాత్రి 7 గంటలకు రెండు వర్గాల మధ్య గొడవకు జరిగింది. గోవధను నిషేధించాలని ఓ వర్గం వారు నిన్న మధ్యాహ్నం పట్టణంలో ఆందోళనకు దిగారు. బంగ్లా చెరువు వద్ద గోవులు కనిపించడంతో ఓ వర్గం వారి కోసం వధించేందుకు తెచ్చారని మరో వర్గం వారు పోలీసులకు సమాచారం అందించారు. నర్సిఖేడ్‌లో ఇంకొన్ని ఆవులున్నాయ ని పోలీసులకు తెలపడంతో సీఐ అక్కడికి వెళ్తుండగా, ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరోవర్గం యువకుడిపై కత్తితో దాడిచేశాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, ఇరువర్గాలు రాళ్ల దాడికి దిగారు.

Next Story