ఖదీర్ ఖాన్ కస్టడీ డెత్: న్యాయ విచారణకు సివిల్ సొసైటీ డిమాండ్
ఖదీర్ ఖాన్ కస్టడీ డెత్‌పై సివిల్ సొసైటీ న్యాయ విచారణకు డిమాండ్ చేసింది.
By అంజి Published on 2 March 2023 3:48 PM ISTఖదీర్ ఖాన్ (ఫైల్ ఫొటో)
హైదరాబాద్: మెదక్‌లో ఖదీర్‌ఖాన్ కస్టడీ మరణంపై విచారణ జరుపుతున్న సివిల్ సొసైటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందం సాక్ష్యాలను తారుమారు చేయకుండా సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను కోరింది.
మెదక్ పట్టణానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తిని జనవరి 29న మెదక్ పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేయడంతో.. ఫిబ్రవరి 16న అతడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఖదీర్ ఖాన్‌పై 'నిర్దిష్ట ఎఫ్‌ఐఆర్' లేదని సివిల్ సొసైటీ ఆరోపించింది. మూడు ఆసుపత్రుల (రెనోవా హాస్పిటల్, కొంపల్లి, గాంధీ హాస్పిటల్, హైదరాబాద్) వైద్య రికార్డులను భద్రపరచాలని, మూడు ఆసుపత్రుల నుండి వైద్యుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయాలని బృందం డీజీపీని కోరింది.
ఖలీదా పర్వీన్, మురళీ కర్ణం, ఎస్‌క్యూ మసూద్, కృష్ణ కుమారి, మంగ, దీప్తి, కనీజ్ ఫాతిమా, కరీమా, ఫరీసా క్వాద్రీ, నసీమ్ సుల్తానా, గాయత్రి, ఫరియాలతో కూడిన నిజనిర్ధారణ బృందం బాధిత కుటుంబాన్ని, స్నేహితులను, ఇరుగుపొరుగు వారిని కలిసింది. అనంతరం వారు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఖదీర్ స్నేహితుడు రిజ్వాన్‌తో మాట్లాడిన వివరాలతో ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రత్యేక మేజిస్ట్రేట్‌తో పాటు ప్రత్యేక బెంచ్‌ను నియమించి ఖదీర్‌ఖాన్ కేసును త్వరగా విచారించాలని నిజనిర్ధారణ బృందం డిమాండ్ చేసింది. 302 ఐపీసీ కింద తప్పు చేసిన పోలీసు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని కోరారు. తప్పు చేసిన పోలీసు అధికారులపై సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమైన మెదక్ పోలీసు సూపరింటెండెంట్ రోహిణి ప్రియదర్శినిని వెంటనే బదిలీ చేయాలని బృందం డిమాండ్ చేసింది.
ఖదీర్ భార్య ఫర్జానాకు రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని నిజనిర్ధారణ బృందం తెలిపింది.
నిజనిర్ధారణ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. ''ఖదీర్ ఖాన్‌పై నిర్దిష్ట ఫిర్యాదు లేదా ఎఫ్‌ఐఆర్ లేదు. అతనిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారనేది తప్పుగా గుర్తించడం ఆధారంగా మాత్రమే. మెదక్ పోలీసులు బాధితుడిని ఎఫ్‌ఐఆర్, వారెంట్ కూడా లేకుండా అక్రమంగా నిర్బంధించారు. చోరీ కేసులో అసలు నిందితుడిని అరెస్ట్ చేయడంలో విఫలయత్నం చేయడానికే పోలీసులు ఖదీర్‌ను టార్గెట్ చేశారు'' అని వారు పేర్కొన్నారు.
నిజనిర్ధారణ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. గొలుసు బంగారు గొలుసు కాదని ఖదీర్ స్నేహితుడు రిజ్వాన్‌కు తెలిసింది. అది రూ.150 విలువైన సాధారణ గొలుసు అని.. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు చూపించగా, అది ఖదీర్ కాదని 100% నిశ్చయించుకున్నానని రిజ్వాన్ చెప్పాడు. అయితే ఆ వ్యక్తిని ఖదీర్‌గా రిజ్వాన్ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది?
మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్ ఖాన్‌ను జనవరి 29న మెదక్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 16న గాంధీ ఆసుపత్రిలో ఖదీర్ మరణించారు. మెదక్‌లో చైన్ స్నాచింగ్ ఘటనలో మెదక్ పోలీసులు హైదరాబాద్‌లోని యాకుత్‌పురాలో వివాహ వేడుకలో అరెస్టు చేశారు. సీసీటీవీలో ఉన్న వ్యక్తి ఖదీర్ ఖాన్ అని పోలీసులు అనుమానించారు. కానిస్టేబుల్ పవన్ ఖదీర్ స్నేహితుడు రిజ్వాన్‌ను కలవడానికి వెళ్లి ఖదీర్ గురించి సమాచారం చెప్పమని వేధించాడు.
ఖదీర్ రిజ్వాన్‌కు ఫోన్ చేయగా, హైదరాబాద్‌లోని ఖదీర్ సెల్ ఫోన్ టవర్ లొకేషన్‌ను పోలీసులు గుర్తించారు. ఖదీర్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించాలని కోరడంతో మెదక్ పోలీసులు తొలుత హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే, మెదక్ పోలీసులు ఎటువంటి వారెంట్లు లేదా చట్టపరమైన పత్రాలను కలిగి ఉండనందున పోలీసులు సహకరించలేదు.
మెదక్ పోలీసులు ఖదీర్ బావ మొయిన్‌ను సంప్రదించారు. అనంతరం ఖదీర్, అతని బావ మొయిన్‌లను ఎక్కించుకుని ఓ ప్రైవేట్ కారులో తీసుకొచ్చారు. ఖదీర్ బావ మొయిన్‌ను కొట్టి బెదిరించి విడుదల చేశారు. అయితే ఖదీర్‌ను జనవరి 29 నుండి ఐదు రోజుల పాటు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టారు.
ఖదీర్ భార్య వెర్షన్:
వీడియోలో చిత్రహింసలు, క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఖదీర్ భార్య ఫర్జానా తెలిపారు. ఫిబ్రవరి 2న పోలీసులు ఫర్జానాకు ఫోన్ చేసి ఆమె భర్తను తిరిగి తీసుకెళ్లమని చెప్పారు. ఫిబ్రవరి 3న తహశీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేశారు. అతను బైండ్-ఓవర్ పేపర్లపై సంతకం చేయలేక పోవడంతో (అతని చేతులు వాచిపోయాయి), అతని తరపున పోలీసులు పేపర్‌పై సంతకం చేశారు.
తన భర్తను పోలీస్ స్టేషన్‌లో ఉంచి ఎందుకు చిత్రహింసలు పెట్టారని ఫర్జానా పోలీసు సిబ్బందిని ప్రశ్నించారు. అతనిపై ఏమైనా అభియోగాలు ఉన్నట్లయితే, వారు అతన్ని కోర్టులో హాజరుపరచాలి. అయితే వారం రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రావద్దని వారిని పోలీసులు హెచ్చరించారు.