ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU)లో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ PJTAU అధికారులు CIDకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. లీకేజీకి సహకరించిన ఉన్నతాధికారులు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఇన్-సర్వీస్ అగ్రికల్చరల్ B.Sc విద్యార్థులతో పాటు ముగ్గురు బోధనా సిబ్బంది, ఒక బోధనేతర సిబ్బందిని సస్పెండ్ చేశారు. వరంగల్, జగిత్యాల వ్యవసాయ కళాశాలల్లో లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని CIDకి లేఖ రాసినట్టు వర్సిటీ వైస్ చాన్సలర్ డా. అల్దాస్ జానయ్య తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీ విధానంలో మార్పులు చేపట్టనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు.