నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తోన్న రైతు మహోత్సవ వేడుకల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రోగ్రామ్‌కు మంత్రులు తుమ్మల, జూపల్లి, ఉత్తమ్ హెలికాప్టర్‌లో హాజరు అవుతారని అధికారులకు సమాచారం అందింది. అయితే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సభా ప్రాంగణానికి కొద్ది దూరంలో ఓ హెలిప్యాడ్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే మంత్రులు ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌ను పైలెట్ అనూహ్యంగా సభా ప్రాంగణంలోనే ల్యాండ్ చేశాడు. దీంతో హెలికాప్టర్ రెక్కల కారణంగా ఏర్పడిన గాలితో భారీగా దుమ్ము ఎగిసిపడింది. హెలికాప్టర్ ఎఫెక్ట్‌తో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వెల్‌కమ్ బోర్డులు కూడా నేల కూలాయి. దీంతో అక్కడికి ప్రజలు అందరూ పరుగులు తీశారు. అదే ప్రాంగణంలో పంట ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన స్టాళ్లలో కొన్ని ధ్వంసమయ్యాయి.