పార్క్ కావాలన్న చిన్నారి.. మాట ఇచ్చిన కేటీఆర్

Child Request to KTR Twitter .. టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉంటారు. ప్రజలకు సంబంధించిన

By సుభాష్  Published on  3 Dec 2020 12:42 PM GMT
పార్క్ కావాలన్న చిన్నారి.. మాట ఇచ్చిన కేటీఆర్

టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉంటారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను గురించి ఆయన్ను ట్యాగ్ చేస్తే తప్పకుండా స్పందిస్తారనే ప్రచారం కూడా ఉంది. తాజాగా ఓ చిన్నారి కేటీఆర్ ను సామాజిక మాధ్యమాల్లో ఓ రిక్వెస్ట్ పెట్టుకుంది. ఇంతకూ ఆ చిన్నారి కావాలని అనుకుంటోంది ఏమిటో తెలుసా..? ఓ పార్కు. తమ ఏరియాలో పార్క్ కోసం కేటాయించిన ప్రాంతాన్ని డెవలప్ చేయాలని కోరింది. దీనిపై స్పందించిన కేటీఆర్ వీలైనంత త్వరగా పార్కును డెవలప్ చేస్తామని మాట ఇచ్చారు.

తన పేరు శ్రీ కృతిక అని.. తాము బోడుప్పల్ ప్రాంతంలో నివాసముంటున్నామని ఆ చిన్నారి తెలిపింది. 1200 చదరపు అడుగుల ప్రాంతం ఉందని.. కానీ మా కాలనీలో పార్కు లేదని తెలిపింది. 200 మందికి పైగా చిన్నారులు ఉన్నారని.. వారికి ఆడుకోడానికి పార్కు కావాలని ఆ చిన్నారి కోరింది. వీలైతే మా కాలనీకి రావాలని కేటీఆర్ ను ట్విట్టర్ లో కోరింది.

ఈ ట్వీట్ ను చూసిన కేటీఆర్ మీ ఏరియాలో త్వరలోనే పార్క్ వస్తుందని హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో అధికారులకు సూచనలు కూడా చేశారు.

Next Story