కంటి వెలుగు రెండో విడత షురూ.. ప్రారంభించిన కేసీఆర్‌, జాతీయ నేతలు

Chief Ministers Launched Second Phase Kanti Velugu Programme. ప్రపంచంలోనే అతిపెద్ద కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని బుధవారం ఖమ్మంలోని

By అంజి  Published on  18 Jan 2023 10:00 AM GMT
కంటి వెలుగు రెండో విడత షురూ.. ప్రారంభించిన కేసీఆర్‌, జాతీయ నేతలు

ప్రపంచంలోనే అతిపెద్ద కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని బుధవారం ఖమ్మంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ప్రారంభించారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల్లో సామూహిక కంటి పరీక్ష శిబిరాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు , కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఇతర జాతీయ నేతలు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

సుమారు 1.5 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమం గురించి అధికారులు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వీవీఐపీలకు వివరించారు. నాయకుల సమక్షంలో కంటి వెలుగు శిబిరాల్లో నిర్వహించే తరహాలో వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో ఆరుగురికి కంటి పరీక్షలు నిర్వహించారు. జాతీయ నేతలు ప్రతి లబ్ధిదారునికి కళ్లద్దాలను అందజేశారు. కంటి వెలుగు లబ్ధిదారులు ధరవాత్‌ బిచ్చమ్మ, మందా అన్నపూర్ణ, రామనాథం, కోలం జ్యోతి, వెంకటేశ్వర్లు, షేక్‌ గౌసియా బేగంకు నేతలు సీఎం పినరయి విజనయ్‌, అరవింద్‌ కేజ్రీవాల్ భగవంత్‌ మాన్‌, సీఎం కేసీఆర్‌, అఖిలేశ్‌ యాదవ్‌, డీ రాజా కంటి అద్దాలను అందజేశారు.

ఈ సందర్భంగా కంటి వెలుగుపై రూపొందించిన కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో భాగంగా రెండో దశలో 1500 వైద్య బృందాలతో 100 పనిదినాలు నిర్వహిస్తారు. దాదాపు 1.5 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి 55 లక్షల మందికి కళ్లద్దాలు, మందులు పంపిణీ చేయనున్నారు. కంటి వెలుగు శిబిరాలు వారంలో ఐదు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి.

అంతకుముందు ఖమ్మం జిల్లా వి వెంకటాయపాలెం గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ లక్ష్యం, జిల్లా పాలనను ప్రజలకు చేరువ చేసే విధానాన్ని చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారులకు వివరించారు.



Next Story