తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాలలోని చాలా కుటుంబాలు నాన్ వెజ్ కు దూరంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చికెన్ ధర బాగా తగ్గింది. సాధారణంగా సండే అంటే ముక్కలు తప్పకుండా ఉండాల్సిందే కొన్ని ఇళ్లల్లో!! ఇప్పుడు కార్తీక మాసం కావడంతో చాలా మంది మాంసానికి దూరమయ్యారు. నాన్ వెజ్ హోటళ్లు కూడా బిజినెస్ డల్ అయ్యాయని తెలిపాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ ధరలు గణనీయంగా తగ్గాయి. గత 10 రోజుల ధరలతో పోలిస్తే ధరలు దాదాపు 50% తగ్గినట్లు మార్కెట్ డేటా చూపుతోంది. గతంలో కిలో రూ. 270-300 ఉన్న స్కిన్‌లెస్ చికెన్ ఇప్పుడు రూ. 200కి అందుబాటులో ఉంది. విశాఖపట్నంలో విత్ స్కిన్ చికెన్ ధర రూ. 160, స్కిన్‌లెస్ రూ. 200, బోన్‌లెస్ రూ. 210 ధరలు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, కడప ప్రాంతాల్లో ఓ 20 రూపాయలు ఈ ధరలకు అటు ఇటుగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుముఖం పట్టవచ్చని భావిస్తున్నారు.