చేవెళ్ల బస్సు ప్రమాదం.. కోలుకుంటున్న బాధితులు.. నేడు 30 మంది డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన ముప్పై మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని..

By -  అంజి
Published on : 4 Nov 2025 12:09 PM IST

Chevella, Bus Mishap, 30 Injured, Telangana

చేవెళ్ల బస్సు ప్రమాదం.. కోలుకుంటున్న బాధితులు.. నేడు 30 మంది డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన ముప్పై మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఎక్కువ మంది మంగళవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వారిలో ఎవరికీ పెద్ద గాయాలు కాలేదని ఒక పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదం తర్వాత మొత్తం 38 మంది ప్రయాణికులకు వైద్య చికిత్స అందించగా, వారిలో ఎనిమిది మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు.

అటు మృతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం తర్వాత వారి బంధువులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. 19 మంది మరణించగా, 17 మంది అంత్యక్రియలు పూర్తయ్యాయని అధికారి తెలిపారు. సోమవారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో కంకరతో నిండిన టిప్పర్ లారీ ప్రభుత్వ బస్సును ఢీకొన్న ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. టిప్పర్‌లో ఉన్న కంకరలో చాలా భాగం బస్సులో పడటంతో సగం బస్సు రాళ్లతో నిండిపోయింది. కొంతమంది ప్రయాణికులు బస్సులో సీట్ల మధ్య ఇరుక్కుపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న అనేకమంది ప్రయాణికులు ఈ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Next Story