18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్

18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం చేప‌ట్ట‌నున్న‌ట్లు గాంధీభ‌వ‌న్ వర్గాలు తెలిపాయి.

By Kalasani Durgapraveen  Published on  16 Dec 2024 10:46 AM GMT
18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్

18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం చేప‌ట్ట‌నున్న‌ట్లు గాంధీభ‌వ‌న్ వర్గాలు తెలిపాయి. నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్ల‌డించారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.

అమెరికాలో గౌతమ్ ఆధానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలు వ్యాపార, ఆర్థిక రంగాలలో దేశ పరువును దెబ్బతీసాయని.. ఆధానీపై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మని లాండరింగ్, మార్కెట్ మనిపులేషన్ లాంటి అంశాలలో ఆయనపై ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీసాయని.. అలాగే మణిపూర్ లో వరుసగా జరిగిన అల్లర్లు, విద్వంసాలపై మోదీ ఇప్పటి వరకు అక్కడకు వెల్లకపోవడంలాంటి అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు చలో రాజ్ భవన్ కార్యక్రమం చేప‌ట్టిన‌ట్లు ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపారు.

Next Story