కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీకి లేఖ రాశారు. తెలంగాణలో మార్చి 8తో ముగిసిన వారంలో 132 కేసులు నమోదు కాగా, మార్చి 8-15 వరకు 267 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 0.31శాతానికి చేరింది. కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని, టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలని ఆదేశించారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు ఇలాంటి ఆదేశాలే ఇచ్చారు.
తెలంగాణలో గురువారం కొత్తగా 27 కరోనా కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో హైదరాబాద్‌లో 12, సంగారెడ్డిలో 2 కేసులు, మిగిలిన 13 కేసులు 13 జిల్లాల్లో ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం 281 యాక్టివ్ కేసులు ఉన్నాయి.