మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రులు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బంజారాహిల్స్ లోని షేక్ పేట తాసిల్దార్ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఒక మహానుభావుడు చెప్పినట్టుగా ఇంట్లో సిలిండర్ కి దండం పెట్టి వచ్చి ఓటు వేశానని అన్నారు. విద్యావంతులు, యువకుల సమస్యలను అర్థం చేసుకొని తీర్చగలిగే సామర్థ్యము, అవకాశం ఉన్న అభ్యర్థికే ఓటు వేశానని కేటీఆర్ అన్నారు.
హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఓల్డ్ మలక్ పెట్ లోని అగ్రికల్చర్ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోంమంత్రి తనయుడు మహమ్మద్ అజాం అలీ అజాంపురా లోని అడమ్స్ స్కూల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ దంపతులు బంజారాహిల్స్ లోని షేక్ పేట తాసిల్దార్ కార్యాలయంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హిమాయత్ నగర్ లోని ఉర్దూ పాఠశాలలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గాంధీనగర్ డివిజన్ తూనికలు కొలతలు కార్యాలయంలో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్, యువ నాయకుడు ముఠా జై సింహ ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా నకిరేకల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్.