కవితకు మళ్లీ నోటీసులు ఇచ్చిన CBI అధికారులు

CBI Issues Court Summons to Kavitha

By -  Medi Samrat
Published on : 12 March 2026 2:19 PM IST

కవితకు మళ్లీ నోటీసులు ఇచ్చిన CBI అధికారులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు మళ్ళీ వచ్చాయి. సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసానికి ఈ కేసులో హైకోర్టు జారీ చేసిన నోటీసులను అందజేసేందుకు వెళ్లారు. అధికారులు కవిత నివాసానికి వెళ్లిన సమయంలో ఆమె అక్కడ అందుబాటులో లేరు. దీంతో సీబీఐ అధికారులు ఆ నోటీసులను ఆమె భర్త అనిల్ కుమార్‌కు అందజేశారు. ఈ నెల 16న ఢిల్లీ హైకోర్టుకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో కవితతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురికి కూడా సీబీఐ నుంచి నోటీసులు అందాయి.

Next Story