సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బాల్క సుమన్‌పై కేసు నమోదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన భారత రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మంచిర్యాల పట్టణ పోలీసులు సోమవారం క్రిమినల్ కేసు నమోదు చేశారు

By Medi Samrat  Published on  5 Feb 2024 9:58 PM IST
సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బాల్క సుమన్‌పై కేసు నమోదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన భారత రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మంచిర్యాల పట్టణ పోలీసులు సోమవారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుమ‌న్‌ స్పందిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మంచిర్యాల బీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు బాల్క సుమన్‌పై వ్యాపారవేత్త, మంచిర్యాల బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి ఫిర్యాదు చేసినట్లు మంచిర్యాల పట్టణ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మహేందర్‌ తెలిపారు. సభలో ప్రసంగిస్తూ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని దూషించారని, చెప్పును చూపించి దూషించారని ఫిర్యాదులో పేర్కొన్న‌ట్లు మహేందర్ పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బాల్క సుమన్ కార్యకర్తలను రెచ్చగొట్టారని తిరుపతి తన ఫిర్యాదులో పేర్కొన్నారని, తదుపరి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Next Story