భైరి నరేష్‌పై కేసు నమోదు

Case Filed Case Against Bairi Naresh. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌పై కేసు నమోదు అయ్యింది.

By M.S.R  Published on  30 Dec 2022 1:42 PM GMT
భైరి నరేష్‌పై కేసు నమోదు

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌పై కేసు నమోదు అయ్యింది. నరేష్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కొడంగల్‌ పోలీసులు. ఇటీవల ఓ సభలో హిందూ దేవుళ్లను, అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు నిరసనలు, రాస్తారోకో చేపట్టారు. ఈ క్రమంలో కోస్గిలో వీడియోలు తీస్తూ అనుమానాదాస్పదంగా వ్యవహరించిన బాలరాజు అనే వ్యక్తిపై అయ్యప్ప మాలధారులు దాడి చేశారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో భైరి నరేష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. 295/ఏ, 298, 153ఏ, 505(2) సెక్షన్‌ల కింద కేసు నమోదు అయ్యింది. పరారీలో ఉన్న నరేష్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించమని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు.

నరేష్ వ్యాఖ్యలపై హిందువులు, అయ్యప్ప భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మాలధారులు అతడికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


Next Story