అక్కినేని నాగార్జునపై కేసు.. కక్ష సాధింపులకు దిగారా.?

అక్కినేని నాగార్జునపై పోలీస్‌ కేసు అయింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు చేశారు.

By M.S.R  Published on  5 Oct 2024 12:54 PM IST
అక్కినేని నాగార్జునపై కేసు.. కక్ష సాధింపులకు దిగారా.?

అక్కినేని నాగార్జునపై పోలీస్‌ కేసు అయింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటూ అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు చేశారు. ‘జనం కోసం’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అక్కినేని నాగార్జున భూములను ఆక్రమించి అక్రమంగా సంపాదించారంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించి లాభాలు ఆర్జించారని.. వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువును నాగార్జున కబ్జా చేసినట్లు ఇరిగేషన్ అధికారులు ధృవీకరించిన ఆధారాలతో ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మాదాపూర్ పోలీసులు ఫిర్యాదును కూడా స్వీకరించినట్లుగా ఆయనకు కాపీ ఇచ్చారు. తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021న నివేదిక ఇచ్చారని.. వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు.

Next Story