కేసీఆర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అరవింద్‌పై కేసు నమోదు
Case Against BJP MP Arvind for Alleged Derogatory Remarks on KCR. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నిజామాబాద్‌కు చెందిన
By అంజి Published on 20 July 2022 8:00 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నిజామాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్‌లో జులై 13న లోక్‌సభ సభ్యుడు అరవింత్, బీజేపీ క్యాడర్‌తో కలిసి ప్రెస్ మీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రిపై కించపరిచే, దూషించే పదాలను ఉపయోగించారని ఆరోపించిన న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా జూలై 20, బుధవారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
"ప్రెస్ మీట్ సందర్భంగా.. బీజేపీ ఎంపీ అరవింత్ తెలంగాణ ముఖ్యమంత్రిని దుర్భాషలాడారు. సీఎం హోదా వ్యక్తిపై ఉపయోగించిన అవమానకరమైన పదాలు ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి బహిరంగంగా అతని ప్రతిష్టను దిగజార్చినట్లుగా ఉన్నాయి" అని ఫిర్యాదుదారు ఆరోపించారు.
"తెలంగాణ సీఎంకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసినట్లుంది. అరవింద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు" అని పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు ఆధారంగా.. స్థానిక కోర్టు నుండి అనుమతి తీసుకున్న తర్వాత, సెక్షన్ 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), భారతీయ శిక్షాస్మృతిలోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. విచారణ జరుగుతోందని, నోటీసు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.
అధికార టీఆర్‌ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటైన విమర్శలకు పేరుగాంచిన నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై గతంలో కూడా అధికార పార్టీ మద్దతుదారుల దాడి జరిగింది. జూలై 15న జగిత్యాల జిల్లా ఎరదండి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు ప్రయత్నించిన అరవింద్ కాన్వాయ్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీని సురక్షితంగా చేర్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. డెక్కన్ హెరాల్డ్ ప్రకారం.. గ్రామస్తులను టిఆర్ఎస్ ప్రేరేపించిందని బిజెపి ఆరోపించింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె. కవితపై గెలిచి నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాన్ని అరవింద్ కైవసం చేసుకున్నారు.