Khammam: ఆటోరిక్షాను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మంగళవారం నాడు రోజువారీ కూలీలతో వెళ్తున్న ఆటోరిక్షాను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు

By అంజి
Published on : 25 April 2023 1:00 PM IST

Khammam district, Enkoor, accident

Khammam: ఆటోరిక్షాను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు 

హైదరాబాద్: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మంగళవారం నాడు రోజువారీ కూలీలతో వెళ్తున్న ఆటోరిక్షాను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఏన్కూరు సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. వీరిని కల్లూరుకు చెందిన వరమ్మ, వెంకటమ్మగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మిగిలిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కల్లూరుకు చెందిన కూలీలు ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో వ్యవసాయ పొలంలో పనులకు వెళ్తున్నారు. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో స్థానికులు తమ వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Next Story