తెలంగాణలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు హైదరాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను పెంచాలని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్‌మోహన్‌నాయుడును కోరారు.
ప్రభాకర్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. పౌర విమానాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్బంగా రామ్‌మోహన్ నాయుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాలకు మెరుగైన సేవలు అందించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
కొత్త విమానాశ్రయాల అభివృద్ధి వల్ల స్థానికులకు వ్యాపార, ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు. ప్రభాకర్ రెడ్డి 2014 నుంచి 2024 వరకు మెదక్ ఎంపీగా పనిచేసినందున ఆ కాలంలో ఎంపీగా పనిచేసిన రామ్మోహన్ నాయుడుతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది.