వరంగల్‌ ఈస్ట్‌లో బీఎస్పీ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి జోరుగా ప్రచారం

వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి పుష్పితలయ్య జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

By అంజి  Published on  21 Nov 2023 11:45 AM IST
BSP, transgender candidate, Warangal East, Telangana Polls, Pushpithalaya

వరంగల్‌ ఈస్ట్‌లో బీఎస్పీ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి జోరుగా ప్రచారం

తెలంగాణలోని వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి పుష్పితలయ్య జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రజల నుంచి మద్దతు కోరుతున్నారు. తనను ఎన్నికల్లో నిలబెట్టినందుకు పార్టీ అధినేత్రి మాయావతికి పుష్పితాలయ కృతజ్ఞతలు తెలిపారు. “బీఎస్పీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. మా సంఘం సంతోషంగా ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ట్రాన్స్‌జెండర్ల సంఘం కూడా బీఎస్పీతో కలిసి పని చేస్తోంది’’ అని ఆమె అన్నారు.

బహుజనవాదం వస్తేనే బతుకులు మారుతాయని లయ అంటున్నారు. బీఎస్పీ అభ్యర్థి పుష్పిత లయ.. బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, బిజెపి అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావులతో తలపడుతున్నారు. తనను గెలిపిస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో తన మార్క్‌ని చూపిస్తానని లయ చెబుతున్నారు. విద్యావంతురాలిగా తానేమిటో నిరూపించుకుంటానని పేర్కొన్నారు. గతంలో కూడా ట్రాన్స్‌జెండర్లకు చెందిన వారికి బీఎస్పీ టికెట్ ఇచ్చిందని పుష్పిత లయ తెలిపారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని కొరేయ్ అసెంబ్లీ స్థానం నుంచి కాజల్ నాయక్ అనే ట్రాన్స్‌జెండర్‌ను బీఎస్పీ పోటీకి దింపింది. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మరో నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. గతంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)గా పిలువబడే అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మొత్తం 119 స్థానాల్లో 47.4 శాతం ఓట్లతో 88 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.

Next Story