బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నిక అయ్యారు.
By Srikanth Gundamalla
బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నిక అయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు కే.కేశవరావు అధ్యక్షతన ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేంతా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆర్ ఉండాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు బలపరిచారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ లీడర్‌గా పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గాయం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా సమావేశానికి హాజరుకాలేదు. అయితే.. కేసీఆర్ నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యేలంతా చెప్పారు. కేసీఆర్ శాసనసభా పక్ష నేతగా ఉండాలని ఎమ్మెల్యేలంతా తీర్మానాన్ని బలపరిచి ఏకగ్రీవంగా ఆయన్ని ఎన్నుకున్నారు. అయితే.. కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేవు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ముందున్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు.