వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ వార్నింగ్

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  24 March 2024 9:32 AM GMT
brs,  ktr, warning,  youtube channels ,

 వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ వార్నింగ్

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. బాద్యాతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్‌ చానెళ్లు కొన్ని ఇష్టారీతిగా ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అసత్యాలన ప్రసారం చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి వార్తలతో ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తంబ్‌ నెయిల్స్‌ ద్వారా ప్రజలను ఆకర్షించడానికి, వార్తల పేరుతో శుద్ద అబ్ధాలు చూపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

వ్యతిరేకత వల్లనో లేదంటే అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన, ఫేక్‌ న్యూస్‌లను వార్తలను ప్రచారం చేయడం ఇకనైన మానుకోవాలని ఆయా యూట్యూబ్‌ చానెళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇది వ్యక్తిగతంగా తనతో పాటు, తమ పార్టీని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా చేస్తున్నామని చెప్పారు. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చర్యగా భావిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గతంలో అసత్య ప్రచారాలు, అవాస్తాలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఫేక్‌ వార్తలను ప్రసారం చేస్తున్న ఆయా యూట్యూబ్‌ చానెల్స్‌పై కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఫిర్యాదులు చేస్తామని చెప్పారు. క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు.

ఇక ముందు ఫేక్‌ న్యూస్‌ రాస్తే తీవ్రంగా పరిగణించి వెంటనే ఫిర్యాదులు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యూట్యూబ్‌ చానెళ్లపై బ్యాన్ విధించేలా ముందుకు వెళ్తామన్నారు. తీరు మార్చుకుని నిజమైన వార్తలను ప్రజలకు అందించాలని ఈ మేరకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కుట్రపూరితంగా వార్తలు రాస్తే మాత్రమే శిక్షలకు రెడీగా ఉండాలని చెప్పారు.

Next Story