కేన్స్‌ కంపెనీ వెళ్లిపోవడం బాధగా ఉంది.. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతుండటం చూస్తుంటే బాధగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on  12 March 2024 9:15 AM GMT
brs,  ktr, tweet, Kaynes company,

కేన్స్‌ కంపెనీ వెళ్లిపోవడం బాధగా ఉంది.. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతుండటం చూస్తుంటే బాధగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేన్స్ కంపెనీ గుజరాత్‌కు తరలిపోతుందనీ.. ఇక్కడే కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా మాజీమంత్రి కేటీఆర్ ఒక పోస్టు పెట్టారు.

కేన్స్‌ కంపెనీ గుజరాత్‌కు తరలిపోతుందని ఇంగ్లీష్‌ పత్రికల్లో వచ్చిన వార్తను మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు తామెంతో కష్టపడ్డామని గుర్తు చేశారు. కానీ.. ఆ కష్టాన్నంతా ఇప్పుడు నిష్పలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేన్స్‌ కంపెనీ గుజరాత్‌కు వెళ్లిపోతుందనే వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు కేటీఆర్. ఎంతో ప్రయత్నించి కేన్స్‌ కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చేలా ఒప్పించిట్లు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆ కంపెనీని కన్విన్స్ చేశామని కేటీఆర్ తెలిపారు.

ఫాక్స్‌కాన్‌ దగ్గరలో ల్యాండ్‌ కావాలంటే ఆ కంపెనీకి 10 రోజుల్లోనే భూమి కూడా కేటాయించామని మాజీమంత్రి కేటీఆర్ చెప్పారు. కేన్స్‌ కంపెనీ రాష్ట్రానికి రావడం వల్ల సెమీకండక్టర్ రంగంలో ఎంతో పురోగతి ఉంటుందని తెలిపారు. పెట్టుబడులు తెలంగాణలోనే కొనసాగించేలా కేన్స్‌ కంపెనీని ఒప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేన్స్ కంపెనీని తెలంగాణ నుంచి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.


Next Story