ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధపు మద్యం కుంభకోణం పేరుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చారని, దీనివల్ల అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాజకీయంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు న్యాయస్థానంలో కవితకి న్యాయం జరిగిందని, భవిష్యత్తులో తమ పార్టీ నాయకులపై ఉన్న మిగిలిన అబద్ధపు కేసులు కూడా వీగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. నిందలే సాక్ష్యాలుగా, మీడియా ట్రయల్సే విచారణలుగా మారిన ప్రస్తుత "న్యూ ఇండియా"లో ఇది కొత్త ఆచారం అయిపోయిందని, ఎంత తప్పుదోవ పట్టించినా చివరకు న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.