వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం ఆ పార్టీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ రజతోత్సవ సభను వియవంతం చేయాలని కోరుతూ శేరిలింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించారు. ఒడిశాలోని పూరీ సముద్ర తీరం చెంత ఛలో వరంగల్ సభకు సంబంధించిన వివరాలను సైకత శిల్పంలో పేర్కొన్నారు. సైకత శిల్పంలో తెలంగాణ మ్యాప్ తో పాటుగా అందులో కేసీఆర్ చిత్రాన్ని, 25 ఏళ్ల ప్రస్థానంకు సంబంధించి కేసీఆర్ నాయకత్వంలో చేసిన సర్వీస్, కమిట్ మెంట్, తెలంగాణ ప్రోగ్రెస్ ను తెలుపుతూ అందులో పేర్కొన్నారు.
పార్టీ ఏర్పాటు జరిగి 25 ఏళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న సభకు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు తరలి రావాలని చెబుతూ రవీందర్ యాదవ్ ఈ సైకత శిల్పాని పూరీ తీరాన గీయించినట్లుగా ఆయన తెలిపారు. ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ నిర్వహించే సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చరిత్రలో నిలిచే సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని రవీందర్ యాదవ్ ప్రతి ఒక్కరిని కోరారు.