తెలంగాణ మహిళా శక్తికి ప్రతీక ఐలమ్మ: కేసీఆర్
సెప్టెంబర్ 10వ తేదీన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యల ఐలమ్మ వర్ధంతి.
By Srikanth Gundamalla Published on 10 Sep 2024 6:30 AM GMTసెప్టెంబర్ 10వ తేదీన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యల ఐలమ్మ వర్ధంతి. ఈ సందర్బంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ మహిళా శక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీక అని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐలమ్మ పోరాటం గొప్పదనీ.. ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఇమిడి ఉన్నదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎప్పుడూ రాష్ట్ర ప్రజానీకానికి ఆదర్శమని కేసీఆర్ అన్నారు. ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించే దిశగా జయంతిని తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉండగా నిర్ణయించిందని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.
ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శమన్నారు. ఆమె పోరాటం తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హరీశ్‌రావు ఘనంగా నివాళులర్పించారు. నాటి సాయుధ పోరాట కాలంలో యోధురాలు ప్రదర్శినంచిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరనికీ ఎంతో స్ఫూర్తి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ వచ్చిందని చెప్పారు హరీశ్‌రావు. ఇక భావితరాలకు మహనీయురాలి చరిత్ర తెలియాలనీ.. పుస్తకాల్లో పాఠ్యాంశంగా పెట్టాలని ఎక్స్‌లో హరీశ్‌రావు రాసుకొచ్చారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక.. మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ.
— Harish Rao Thanneeru (@BRSHarish) September 10, 2024
నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి.
నేడు… pic.twitter.com/szs6upnEia