బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వెరైటీ నిరసన, ఎండు మిర్చిల దండలను మెడలో ధరించి..

ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలి ఆవరణలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

By Knakam Karthik
Published on : 17 March 2025 11:28 AM IST

Telangana, Brs MLCs, Assembly Sessions, Protest

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వెరైటీ నిరసన, ఎండు మిర్చిల దండలను మెడలో ధరించి..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలి ఆవరణలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తెలంగాణ మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎండు మిర్చిలతో తయారు చేసిన దండలను ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మిర్చి పంటలకు వెంటనే రూ.25 వేల గిట్టుబాటు ధర ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్సీలు నిరసన తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్ లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైతే, ధర లేక ఈ సీజన్లో 2 లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నాఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాల్ కు రూ.25 వేల గిట్టుబాటు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాడంతో పాటు రాష్ట్రంలో పండుతున్న మిర్చి పంట విదేశాలకు ఎగుమతి అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story