ఈటల రాజేందర్ ప్రతి రోజు బాత్‌రూంలో ఏడుస్తున్నాడు: ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి.
By Srikanth Gundamalla
ఈటల రాజేందర్ ప్రతి రోజు బాత్‌రూంలో ఏడుస్తున్నాడు: ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి. ఈటల రాజేందర్ పార్టీ నంచి వెళ్లిపోయి.. ఆ తర్వాత బీజేపీలో చేరిన విషయం తెలిసింది. ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత హుజూరాబాద్‌లో ఉపఎన్నిక లాంఛనమైంది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో మళ్లీ ఈటలనే గెలిచారు. అయితే.. కొద్దికాలం నుంచి బీజేపీలో ఏర్పాటు చేస్తోన్న కార్యక్రమాల్లో ఈటల రాజేందర్ చురుకుగా పాల్గొనడం లేదు. ఈ క్రమంలో ఈటల పార్టీ మారతారనే వార్తలూ వినిపించాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఈటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతి రోజు ఈటల రాజేందర్ బాత్‌రూంలోకి వెళ్లి ఏడుస్తున్నారని చెప్పారు. ఎందుకు కేసీఆర్‌తో గొడవ పెట్టుకున్నానని ప్రతిరోజు తపన పడుతున్నారని.. ఈ విషయం ఈటల ఇంట్లో పని చేసే వారు తనతో చెప్పారని కౌశిక్‌రెడ్డి తెలిపారు. అనవసరంగా బీఆర్ఎస్‌ను వీడానని ఈటల ఇప్పుడు బాధపడుతున్నట్లు చెప్పారు. తప్ప చేశానని ఈటల పశ్చ్యాత్తాప పడుతున్నట్లు తెలిపారు. ఈటల కాంగ్రెస్‌లోకి వెళ్తారో.. బీఆర్‌ఎస్‌లోకి వస్తారో తెలియదని చెప్పారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్‌కు ఈటల పెద్దగా చేసిందేమీ లేదంటూ విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఈ విషయంపై అంబేద్కర్ సెంటర్‌లో చర్చించడానికి కూడా తాను సిద్ధమని.. ఈటలకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఉద్యమకారుడినని అని చెప్పుకునే రాజేందర్ స్థానిక ఎమ్మెల్యేగా హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లోని 18 వేలకుపైగా ఉన్న దళిత కుటుంబాలకు రూ.1,800 కోట్లతో దళితబంధు పథకాన్ని అమలు చేశామని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు.
ఈటెల రాజేందర్ ప్రతి రోజు బాత్‌రూంలో ఏడుస్తున్నాడుకేసీఆర్తో ఎందుకు పెట్టుకున్నానా అని, బీఆర్ఎస్ పార్టీ నుండి ఎందుకు వెళ్ళిపోయానా అని ఈటెల రాజేందర్ ప్రతి రోజు బాత్‌రూంలో ఏడుస్తున్నాడు - ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/10eo3KzGD7
— Telugu Scribe (@TeluguScribe) June 24, 2023