ఎక్సైజ్ కుంభకోణంతో ముడిపడి ఉన్న అవినీతి కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కె. కవితపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శుక్రవారం అదనపు చార్జ్ షీట్‌ను సమర్పించింది. కె కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు జూలై 6న పరిశీలనకు ఉంచింది. మరోవైపు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు కూడా కె.కవితకు జ్యుడీషియల్ కస్టడీని జూన్ 21 వరకు పొడిగించింది. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో రిమాండ్‌ను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి తనకు పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరింది. ఆమె విజ్ఞప్తికి కోర్టు ఆమోదం తెలిపింది. కవితకు జైల్లో ఎనిమిది పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
ఈ కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ (జేసీ)లో ఉన్న కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కూడా విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. కవిత బెయిల్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.