సీఎం దేవుళ్ల‌ మీద ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూకంపం వచ్చింది

బంజారాహిల్స్ ఏసీపీకి పొద్దునే ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు రమ్మన్నారు.. నేను పోలీస్ స్టేషన్ వెళ్లే కన్నా ముందే ఏసీపీ వెళ్లిపోయారని.. సీఐ కూడా వెళ్లి పోయేందుకు ప్రయత్నిస్తే మా పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on  4 Dec 2024 4:52 PM IST
సీఎం దేవుళ్ల‌ మీద ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూకంపం వచ్చింది

బంజారాహిల్స్ ఏసీపీకి పొద్దునే ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు రమ్మన్నారు.. నేను పోలీస్ స్టేషన్ వెళ్లే కన్నా ముందే ఏసీపీ వెళ్లిపోయారని.. సీఐ కూడా వెళ్లి పోయేందుకు ప్రయత్నిస్తే మా పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్యే అని గౌరవం లేకుండా సీఐ ప్రవర్తించారని.. డీజీపీ కన్నా ఎక్కువ ప్రోటో కాల్ ఎమ్మెల్యేకు ఉంటుందని సీఐకి తెలియదా.? అని ప్ర‌శ్నించారు.. ఏ ప్రజాప్రతినిధి కానీ సీఎం సోదరులకు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారన్నారు.

చివరకు బంజారాహిల్స్ పీఎస్ సీఐకి నా ఫిర్యాదునిచ్చి రసీదు తీసుకున్నాన‌ని తెలిపారు. నా ఫోన్ ట్యాప్ అవుతుంది అనేది నా ప్రధాన ఆరోపణ.. సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. నేను ఓ మిత్రుడి పార్టీకి వెళితే శివధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి అక్కడికి పోలీసులను పంపించారు.. నా దగ్గర డ్రగ్స్ పెట్టించి కేసు పెట్టించాలని శివధర్ రెడ్డి ప్రయత్నించారు.. ఖ‌చ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి, శివధర్ రెడ్డిపై కేసు బుక్ చేయాల్సిందే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

మా నేత హరీష్ రావుపై బ్రోకర్ రేవంత్ రెడ్డి సూచనతో బ్రోతల్ చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. బ్రోకర్, బ్రోతల్ లు కేసు పెడితే పోలీసులు హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు.? అంటూ తీవ్ర ప‌ద‌జాలంతో ధ్వ‌జ‌మెత్తారు. హరీష్ రావుపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తే.. నా కేసు విషయంలో సీఎం రేవంత్, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేన‌న్నారు. నేనిచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు అని హెచ్చ‌రించారు.మా అగ్ర నేతలందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి.. సీఎం రేవంత్ దేవుళ్ళ మీద ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూకంపం వచ్చిందన్నారు. సీఎం పాపాల నుంచి ప్రజలను దేవుళ్ళే కాపాడాలన్నారు. వచ్చేది మా ప్రభుత్వమే.. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చ‌రించారు.

Next Story