'స్కాలర్‌షిప్‌లు ఎందుకు చెల్లించట్లేదు'.. తెలంగాణ సర్కార్‌పై హరీష్‌రావు ఫైర్‌

వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థులకు జ్యోతిభా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు చెల్లించడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే టి హరీష్ రావు మండిపడ్డారు.

By అంజి  Published on  15 Oct 2024 6:09 AM GMT
BRS MLA Harish Rao, Telangana govt, BC scholarships

'స్కాలర్‌షిప్‌లు ఎందుకు చెల్లించట్లేదు'.. తెలంగాణ సర్కార్‌పై హరీష్‌రావు ఫైర్‌

హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థులకు జ్యోతిభా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు చెల్లించడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే టి హరీష్ రావు అక్టోబర్ 15, మంగళవారం నాడు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద ఆర్థిక సహాయం పొందిన 65 మంది బీసీ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేయడం లేదు? అని హరీశ్‌ రావు ప్రశ్నించారు.

పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) రూపొందించిన ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ మాజీ ఆర్థిక మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాల పేర్లను సులభంగా మారుస్తుందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోదని విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ తెలంగాణ ప్రభుత్వానికి గుర్తులేదా అని ప్రశ్నించారు.

తొలి అసెంబ్లీ సమావేశంలో బీసీ సబ్‌ ప్లాన్‌ అమలు చేస్తామన్న హామీ ఏమైంది? అని హరీష్‌ రావు ప్రశ్నించారు. స్కాలర్‌షిప్‌లు చెల్లించకపోవడంతో అక్టోబరు 22న మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, వెనుకబడిన తరగతుల నాయకుడు ఆర్‌.కృష్ణయ్య సోమవారం హెచ్చరించారు.

‘‘స్కాలర్‌షిప్‌లను రూ.5,500 నుంచి రూ.10,000కు పెంచాలని కోరుతూ గత నాలుగు నెలలుగా నిరసనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఉన్నత విద్యలో సీట్లు వచ్చినా తదుపరి చదువులు చదవలేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు' అని కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

వారిలో కొందరికి ఉద్యోగాలు లభించినప్పటికీ సర్టిఫికెట్లు సమర్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. “కొంతమంది తదుపరి విద్య కోసం వెళ్ళలేరు. తమ ఖర్చులను భరించలేని విద్యార్థులు ఈ పథకాలను పొందుతున్నారని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం దీనిని దృష్టిలో ఉంచుకుని రెండు దశల్లో బడ్జెట్‌ను త్వరగా విడుదల చేయాలి’’ అని కృష్ణయ్య అన్నారు.

సంబంధిత పరిణామంలో, తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ & పీజీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ కృష్ణయ్యతో చర్చలు జరిపి ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన ఫీజులను రాబట్టడంలో సహాయం కోరింది. ఉపాధ్యాయులకు జీతాలు, అద్దెలు చెల్లించడంలో తమకున్న బాధలను యాజమాన్యాలు ఆయనకు వివరించారు.

Next Story