కాంగ్రెస్ సర్కార్ BRS చేసిన అభివృద్ధిని అడ్డుకుంటోంది: హరీశ్‌రావు

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాజీమంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.

By Srikanth Gundamalla  Published on  12 Jan 2024 8:30 AM GMT
brs, mla harish rao,  congress govt, telangana ,

కాంగ్రెస్ సర్కార్ BRS చేసిన అభివృద్ధిని అడ్డుకుంటోంది: హరీశ్‌రావు

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాజీమంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. కొత్త మండలాలు, జిల్లాలను రద్దు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కొత్త విద్యత్‌ పాలసీ తెస్తామని కాంగ్రెస్‌ అంటోందనీ.. కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్‌ కరెంటు తెస్తారా అని మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

కేసీఆర్‌ రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందించారనీ..కానీ దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని కక్షతో అడ్డుకోవడం మానుకోవాలని సూచించారు. ఇక తెలంగాణ ప్రజల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్‌ అనీ.. ఢిల్లీలో పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని ఈ సందర్భంగా మాజీమంత్రి హరీశ్‌రావు కోరారు.


ఓటమిని చవిచూశామనీ ప్రజలను వదిలేయమనీ.. ప్రజల పక్షానే తమ పార్టీ ఉందని చెప్పారు. బీఆర్ఎస్‌కు ప్రజలే దేవుల్లు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేసేలా అసెంబ్లీలో గట్టిగా పోరాడతామని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌ లేకుండా తెలంగాణ లేదు.. ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ సాధించారని ఈ సందర్భంగా హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌ను.. తెలంగాణను ఎవరూ వేరు చేయలేరని అన్నారు.

Next Story