'కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి హత్యా కుట్ర చేస్తున్నాడా?'.. ఎమ్మెల్సీ దాసోజు సంచలన ఆరోపణలు

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరపూరిత, హేయమైన, అశ్లీల వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు.

By అంజి
Published on : 15 March 2025 8:26 AM IST

BRS leader Dasoju Sravan, complaint, Filmnagar police station, CM Revanth Reddy

'కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి హత్యా కుట్ర చేస్తున్నాడా?'.. ఎమ్మెల్సీ దాసోజు సంచలన ఆరోపణలు

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరపూరిత, హేయమైన, అశ్లీల వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. ఇవాళ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రేవంత్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం, డా. దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి చేసిన “మీకు మీరూ, మాకు స్టాచర్ ఉందని అనుకుంటే, స్ట్రెచర్ మీదకి పంపించిండ్రు.. ఇట్లనే చేస్తే, ఆ తర్వాత మార్చురీకి పోతారు..” అనే వ్యాఖ్యల వెనుక తీవ్ర కుట్ర దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని దాసోజు డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి “మార్చురీ” అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా వాడటం, కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం ఉందని సూచించే సంకేతంగా ఉంది. ఇది నేరపూరిత బెదిరింపు మాత్రమే కాదు, రాష్ట్రంలో అశాంతిని, ప్రజల్లో భయాందోళనను పెంచే కుట్రపూరిత చర్య అని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. “ఓ రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఓ ప్రముఖ నాయకుడిని చంపేస్తామని బహిరంగంగా హెచ్చరిస్తే, అది ప్రభుత్వమే హత్యా కుట్ర చేస్తోందన్న అర్థం కాదు?” అని డా. శ్రవణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి నీచ భాషపై ఎందుకు నిశ్శబ్దంగా ఉందని ప్రశ్నించారు.

''రాహుల్ గాంధీ ఎప్పుడూ ‘నఫ్రత్ కే బజార్ మే మోహబ్బత్ కా దుకాన్’ అని మాట్లాడుతాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అందుకు బిన్నంగా వ్యవరిస్తారు. కేసీఆర్ పై ఇలా మాట్లాడటానికి AICC అనుమతి ఇచ్చిందా? రాహుల్ గాంధీకి ఇది కనిపించలేదా? లేక రేవంత్ రెడ్డి భరతం పట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం భయపడుతోందా? ఒక ముఖ్యమంత్రి మాటలకే అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడితే, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతటి అవమానం?'' అని దాసోజ్‌ శ్రవణ్‌ నిలదీశారు.

Next Story