గత ప్రభుత్వ సమాచారాన్ని తీసేస్తున్నారు..సీఎస్ జోక్యం చేసుకోవాలి: కేటీఆర్

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  29 July 2024 5:30 AM GMT
brs, ktr, tweet,   government websites,

గత ప్రభుత్వ సమాచారాన్ని తీసేస్తున్నారు..సీఎస్ జోక్యం చేసుకోవాలి: కేటీఆర్

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సవెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో విధ్వంసం జరుగుతోందని చెప్పారు. దీనిపై తక్షణమే సీఎస్‌ చొరవ తీసుకుని స్పందించాలని.. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. కేసీఆర్ హయాంలోని ముఖ్యమైన సమాచారం, వివరాలను తొలగించారని ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు. గత ప్రభుత్వ సమాచారం, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో భాగమని వాటిని కాపాడాలన్నారు. భవిష్యత్ తరాల కోసం ఈ డిజిటల్ సంపదను పరిరక్షించాలని కేటీఆర్ అన్నారు. దానికోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయ పరంగా ముందుకు వెళ్తామని ఎక్స్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

ఎక్స్‌లో పోస్టు పెట్టిన కేటీఆర్.. ‘సోషల్‌ మీడియా వేదికల నుంచి కేసీఆర్‌ హయాంలోని ముఖ్యమైన సమాచారం, వివరాలు తొలగించబడ్డాయి. అది ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో అంతర్భాగం. ఈ డిజిటల్‌ ఆస్తులను రక్షించడానికి, భవిష్యత్‌ తరాలకు ఈ విషయాన్ని భద్రపరచడానికి మీ తక్షణ చర్య అసవరం. మీరు చర్య తీసుకోకుంటే, మేము న్యాయపరమైన పరిష్కారాన్ని కోరవల్సి వస్తుంది’ అంటూ సీఎస్‌ శాంతికుమారిని మెన్షన్ చేస్తూ కేటీఆర్‌ పోస్టు పెట్టారు.


Next Story