ఆ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి: కేటీఆర్

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  16 Jan 2024 5:23 AM GMT
brs, ktr,  sircilla, handloom, tweet,

ఆ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి: కేటీఆర్ 

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన కొన్నాళ్లుగా వస్తున్న సంక్షోభ వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీమంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా కొనసాగించాలని చెప్పారు. అలాగే వాటికి అనుగుణంగా కాంగ్రెస్‌ సర్కార్‌ మరిన్ని కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ పోస్టు పెట్టారు.

ఎక్స్‌ వేదికగా స్పందించిన కేటీఆర్.. గత పదేళ్ల కాలంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఎంతో నైపుణ్యం ఉన్న పవర్‌లూమ్ నేతన్నలు, అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారని అన్నారు. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే దీనికి ప్రధాన కారణమని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్‌లూమ్‌ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలన్నారు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే.. ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రబత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్‌ వస్త్ర పరిశ్రమతో పోటీగా వెళ్లే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయని అన్నారు. అయితే.. గత 15 రోజులుగా రాష్ట్రంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై సంక్షోభ వార్తలు వస్తున్నాయనీ.. అవి విన్న తర్వాత ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. లేదంటపై హ్యాండ్లూమ్ పరిశ్రమ తీవ్రమైన సంక్షభంలోకి వెళ్లడం పక్కా అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

Next Story