కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మారుస్తోంది: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
By Srikanth Gundamalla Published on 30 May 2024 12:58 PM ISTకాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మారుస్తోంది: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగిస్తున్నారని.. ఇది ఏమాత్రం సబబుకాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశ పూర్వకంగానే రాజముద్రను మారుస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
చార్మినార్‌ను రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తున్నారనీ.. దీన్ని తప్పుడు బడుతూ కేటీఆర్ నిరసన తెలిపారు. ఉదయం కేటీఆర్ చార్మినార్ వద్దకు వెళ్లారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు పద్మారావుగౌడ్, రాజయ్య, మాగంటి గోపీనాథ్ ఇతర బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చార్మినార్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా చార్మినార్ వద్ద నిరసనను వ్యక్తం చేశారు. చార్మినార్‌ను అధికారిక చిహ్నం నుంచి తొలగించొద్దని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కేటీఆర్ నిరసన తెలిపేందుకు వచ్చిన సందర్భంగా చార్మినార్ వద్దకు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున వచ్చారు.ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిరసన తర్వాత మాట్లాడిన కేటీఆర్.. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చార్మినార్ అని చెప్పారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించొద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే మార్పులు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రాజముద్రను ఇంత అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. హైదరాబాద్ ప్రగతిని కనిపించకుండా చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. కేసీఆర్ పేరు కనిపించొద్దని ఈ నిర్ణయాలు తీసుకుంటుందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలు చేర్చాలనీ.. కానీ చార్మినార్‌ను తొలగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
చార్మినార్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు
— Newsmeter Telugu (@NewsmeterTelugu) May 30, 2024
తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నంలో చారిత్రక కట్టడం చార్మినార్‌ను తొలగించడం పట్ల నిరసన pic.twitter.com/aoctR9W1uu