కాంగ్రెస్‌లోనే ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారు: కేటీఆర్

తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

By Srikanth Gundamalla  Published on  1 April 2024 11:30 AM GMT
brs, ktr, comments,  telangana congress, lok sabha election ,

కాంగ్రెస్‌లోనే ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారు: కేటీఆర్

తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని, ఏక్‌నాథ్‌ షిండేలు వారి పార్టీలోనే ఉన్నారని కేటీఆర్ చెప్పారు. నల్లగొండ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు పార్లమెంట్‌ ఎన్నికల్లో జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారనీ.. కానీ వారు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంకా అమలు చేయలేదని ప్రశ్నించారు. రుణమాఫీ నెరవేరిస్తే కాంగ్రెస్‌కు ఓటు వేయండనీ.. లేదంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం అంటే విఫలం అయ్యింది బీఆర్ఎస్‌ నాయకుడు కాదనీ.. అలాగని ప్రజలది కూడా తప్పు కాదని అన్నారు. కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడనీ.. కానీ మన ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని చెప్పారు. అందుకే ఓటమిపాలు కావాల్సి వచ్చిందని కేటీఆర్ కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే మంచి జీతాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నాయనీ.. ఒకటో తేదీన రాకపోవడంతోనే వారు దూరమయ్యామరని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే బీఆర్ఎస్‌కు ఫలితం వస్తుందని కేటీఆర్ అన్నారు. 2018 లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12కి 11 సీట్లు గెలిచామని గుర్తు చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఓడిపోయానమి చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా 11 సీట్లు గెలిచిందనీ.. వారెందుకు ఓడిపోరో చూద్దామని అన్నారు. నల్లగొండ, భువనగిరి ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Next Story