మహిళలపై వ్యాఖ్యలకు కేటీఆర్ వివరణ.. కించపరిచే ఉద్దేశం లేదంటూ పోస్ట్
ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి మహిళలపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 3:46 AM GMTమహిళలపై వ్యాఖ్యలకు కేటీఆర్ వివరణ.. కించపరిచే ఉద్దేశం లేదంటూ పోస్ట్
తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెడుతూ క్లారిటీ ఇచ్చారు.
గురువారం జరిగిన పార్టీ సమావేశంలోనే యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే.. తానను విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అక్కాచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ తనకు లేదని ఎక్స్‌లో పోస్టు ద్వారా వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాగా.. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మాట్లాడారు.
నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..
— KTR (@KTRBRS) August 16, 2024
నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.
బస్సుల్లో ఎల్లిపాయల పొట్టు తీసుకోవడం కాకపోతే కుట్లు, అల్లికలు కూడా పెట్టుకోండి అంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్. ఒక్కొక్కరికి ఒక్కో బస్సు పెట్టి బ్రేక్‌డ్యాన్స్‌లు కూడా వేసుకోండి అంటూ కామెంట్ చేశారు. కేటీఆర్ ఈ విధంగా మాట్లాడటం తో వివాదం రాజుకుంది. పలువురు రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్వలు చేశారు. ఏకంగా కాంగ్రెస్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలుకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. అంతేకాదు.. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు.