బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో జరిగే బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు రావాలని సమాచారం ఇచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదుపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. మరో వైపు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు.
కాగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా మూడుసార్లు మాత్రమే తెలంగాణ భవన్‌లో సమావేశాలు నిర్వహించారు. రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ఆవిర్భావించి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు బీఆర్ఎస్ అధినేత సన్నాహాలు చేస్తున్నారు.