ఎస్సీ వర్గీకరణపై ఆయనది రెండు నాలుకల ధోరణి, రేవంత్‌పై మాజీ ఎమ్మెల్యే విమర్శ

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆరోపించారు.

By Knakam Karthik  Published on  9 March 2025 3:16 PM IST
Telangana News, Brs Ex Mla Thatikonda Rajaiah, Classification of SC,  CM Revanthreddy

ఎస్సీ వర్గీకరణపై ఆయనది రెండు నాలుకల ధోరణి, రేవంత్‌పై మాజీ ఎమ్మెల్యే విమర్శ

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆరోపించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్త అయ్యాకే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యోగాల విషయంలో మాదిగ బిడ్డలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణిని మానుకోవాలని హితవు పలికారు.

30 ఏళ్ల తర్వాత ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఎస్సీలను మోసం చేయాలనే దురుద్దేశంతో గ్రూప్ ఉద్యోగాలను నింపాలని చూస్తున్నారు. షమీమ్ అక్తర్ ఏక సభ్య కమీషన్ ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరణ చేయాలని సూచించింది. ఎస్సీ వర్గీకరణ నివేదిక తప్పుల తడకగా ఉందని మాదిగ, మాదిగ ఉప కులాల నేతలు అభ్యంతరం తెలిపారు. ఆర్థికంగా ఎదిగిన కులాలను గ్రూప్-ఏ లో పెట్టారు.

సీఎం రేవంత్ బయటకు మాదిగలకు అనుకూలంగా ఉన్నట్లు నటిస్తున్నా.. లోలోపల మాలలను ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మాదిగ యువతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల ఫలితాల ప్రకటనను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ నెల 6న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లు )కు మంత్రివర్గం ముక్తకంఠంతో ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాల్సిన సుధీర్ఘంగా చర్చించి ఆమోదించనున్నారు.

Next Story