నాగర్‌కర్నూలులో గువ్వల బాలరాజు అరెస్ట్.. ఉద్రిక్తత

నాగర్‌కర్నూలు జిల్లాలో అచ్చంపేట బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  18 Dec 2023 3:53 PM IST
brs, guvvala balaraju, arrest, nagarkurnool,

నాగర్‌కర్నూలులో గువ్వల బాలరాజు అరెస్ట్.. ఉద్రిక్తత

నాగర్‌కర్నూలు జిల్లాలో అచ్చంపేట బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఆయన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గువ్వల బాలరాజు అరెస్ట్‌ గురించి తెలుసుకున్న ఆ పార్టీ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వెల్దండ వద్ద ఆయన్ని అడ్డగించి అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల అనంతరం తొలిసారి మాజీ ఎమ్మెల్యే గువ్వల బలరాజు పర్యటించేందుకు వెళ్తున్న క్రమంలో అరెస్ట్‌ చేశారు. అయితే.. అచ్చంపేటలో కాంగ్రెస్‌ కూడా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గువ్వల బాలరాజు వెళ్తుండగా హఠాత్తుగా వెల్దండ వద్ద ఆపారు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గువ్వల బాలరాజును అరెస్ట్‌ చేసిన విషయం తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. గువ్వల బాలరాజు అరెస్ట్‌ను ఖండిస్తూ పోలీస్‌ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష్యతోనే గువ్వల బాలరాజుని అరెస్ట్‌ చేయించిందని బీఆర్ఎస్‌ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గువ్వల బాలరాజు అరెస్ట్‌ అక్రమం అనీ.. ఆయన్ని వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ బీఆర్ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను ఉపయోగించుకుని బీఆర్ఎస్ నాయకులను అణచివేయాలని చూస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.


Next Story