రాజ‌య్య‌కు నో.. వ‌న‌మాకు మ‌ళ్లీ అవ‌కాశం..!

భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్‌ టికెట్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే

By Medi Samrat
Published on : 21 Aug 2023 5:35 PM IST

రాజ‌య్య‌కు నో.. వ‌న‌మాకు మ‌ళ్లీ అవ‌కాశం..!

భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్‌ టికెట్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే దక్కడం ఆసక్తిగా మారింది. ఇటీవల ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. పాల్వంచకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆయన కుమారుడు వ‌న‌మా రాఘ‌వ‌ జైలుకు కూడా వెళ్లారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ అధిష్టానం వనమా వెంకటేశ్వరరావుకే మళ్లీ టికెట్‌ కేటాయించింది.

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు భంగపాటు తప్పలేదు. తనకు టికెట్ రావాలని ఆయన రాజశ్యామల యాగం కూడా చేశారు. అయినా ఆయ‌న పూజ‌లు ఫలించలేదు. జానకీపురం సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణల వ్యవహారం ఆయన ఇమేజ్‌ని బాగా దెబ్బతీసింది. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్‌ కడియం శ్రీహరి కేటాయించారు. దీంతో మాజీ డిప్యూటీ సీఎం, ప్ర‌స్తుత ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Next Story